దీపికాను ఏడిపించాడు

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తో పని చేయడం అంత తేలిక కాదు. పని రాక్షసుడాయన. తనకు నచ్చిన అవుట్ అవుట్ వచ్చే వరకూ పరితపిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో అప్పుడుడప్పుడు నటీనటులకు చుక్కలు కనిపిస్తాయి. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా సంజయ్ బాధితురాలే. దీపికా పదుకొణె ‘రామ్‌-లీలా’ సినిమా సెట్‌లో కంటతడి పెట్టిన సందర్భం ఉంది.

ఈ విషయాన్ని మాటల రచయిత గరిమా వాహల్‌ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘దీపికా తొలి రోజు షూటింగ్‌ అది. చివరి క్షణంలో డైలాగ్స్‌ మార్చేయడం వల్ల దీపిక ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంది. చివరి క్షణంలో మార్పులు చేయడం సంజయ్‌ సర్‌కు అలవాటే. సాధారణంగా దీపిక డైలాగ్స్‌ బాగా గుర్తు పెట్టుకుంటారు, కానీ చివరి క్షణంలో డైలాగ్స్‌ మార్చేయడం వల్ల ఆమె పూర్తిగా డల్ అయిపొయింది. మళ్ళీ డైలాగ్స్ నేర్చుకోవడానికి ఒక రోజు పట్టింది” అని చెప్పుకొచ్చాడు వాహల్‌

దీపిక ప్రస్తుతం సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘పద్మావతి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.