వందకోట్లు దాటాల్సిందే !

deepika-padukonబాలీవుడ్ వంద కోట్ల హీరోయిన్ గా దీపికా పదకోన్ దుమ్మురేపుతుంది……..దీపికా న‌టించిన కోక్‌టైల్‌, యే జ‌వాని హాయ్ దివాని, చెన్నై ఎక్స్ ప్రెస్‌, లేటెస్ట్ రామ్‌లీలా మూవీలు వంద కోట్లలోకి చేరి దీపికాను బాక్సాపీస్ క్వీన్‌గా మార్చాయి. బాలీవుడ్ దర్శక, నిర్మాతలకు దీపికా ప‌దుకునే ఇప్పుడు ల‌క్కీ హీరోయిన్‌.

తన అందాలతో ఈ పిల్ల జారా హాట్ గురు అనిపించిన చిన్నది దిపీకా……ఇప్పుడు ఏది పట్టినా బంగారమే…ఏ సినిమా చేసిన వంద కోట్లే…….బాల‌వుడ్‌లో ల‌క్కీ హీరోయిన్ అంటే ఖ‌చ్చితంగా దీపికా ప‌దుకొనె అనే చెప్పవ‌చ్చు. ఎందుకంటే దిపీకా న‌టిస్తున్న మూవీలు అన్నీ వంద‌, రెండు వంద‌లు, మూడు వంద‌ల కోట్లు అంటూ బాక్సాపీస్ లెక్కల‌ను చెప్పుకోవ‌ల‌సి వ‌స్తుంది. లేటెస్ట్‌గా ‘రామ్‌లీలా’ కూడ మూడు రోజుల్లో వంద కోట్ల క‌లెక్షన్స్‌ను కొల్లగొట్టడం ఖాయం అని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

రామ్‌లీలా మూవీ ప్రపంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్‌15న రిలీజ్ అయింది. ఈ మూవీ మొద‌టి రోజు క‌లెక్షన్స్ అదర‌గొట్టాయి. రామ్‌లీలా మూవీ శుక్రవారం క‌లెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఇర‌వై అయిదు కోట్ల రూపాయ‌ల‌ను కొల్లగొట్టింది. అలాగే రెండో రోజు కూడ అదే ఊపును కొన‌సాగిస్తుంది. మొద‌టి రెండు రోజుల క‌లెక్షన్స్ దాదాపు ఆర‌వై కోట్ల వ‌ర‌కూ వ‌చ్చింద‌ని బాక్సాపీస్ ట్రేడ్స్ లెక్కలు చెబుతున్నాయి. ఫ‌స్ట్ వీక్ క‌లెక్షన్స్‌తో వంద కోట్ల క‌లెక్షన్స్‌ను కొల్లగొట్టే అవ‌కాశం ఉంద‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ చెబుతున్న లెక్క. దీంతో దీపకా హ్యాట్రిక్ వందకోట్ల హీరోయిన్ అయింది.