లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. సినీ స్టార్స్ సైతం షూటింగ్ లు బంద్ కావడం తో వారికీ ఫుల్ రెస్ట్ దొరికినట్లు అయ్యింది. ఎప్పుడు షూటింగ్ లతో బిజీ గా గడిపే వీరు..ఇప్పుడు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. మరికొంతమంది వంటిట్లో తమకు ఇష్టమైన వంటకాలు చేస్తూ బిజీ అవుతున్నారు. తాజాగా దీపికా పడుకొనే ఈ లాక్ డౌన్ అనుభవాలను గురించి ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
లాక్ డౌన్ సమయాన్ని నా భర్త రన్వీర్ చాలా బాగా ఉపయోగించుకుంటున్నాడు. రోజులో ఎక్కువ శాతం నిద్రపోవడానికి కేటాయిస్తున్నాడు. సుమారు 20గంటలు నిద్రపోతున్నాడు. ఆ మిగతా నాలుగు గంటలో సమయంలో సినిమాలు – టీవీ చూడటం లాంటివి చేస్తున్నాడు. ఎలాంటి డిమాండ్స్ లేకుండా లైఫ్ గడుపుతున్నాడు. నాకు వంటచేయడం చాలా బాగా వచ్చు – ఇటాలియన్ – వెస్టర్న్ – కాంటినెంటల్ వంటలు చేస్తాను. రన్వీర్ అసలు వంటింట్లోకి రాడు. కానీ నాకు ఇండియన్ వంటలు నేర్చుకోవాలని ఉంది. మైదా పిండి – గోధుమ పిండి – ధనియాలు – పుదీనా వంటి వాటి మధ్య తేడాలను తెలుసుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది.