Site icon TeluguMirchi.com

డిసెంబ‌ర్‌లో సినీ సంద‌డి

dec-mviesసాధార‌ణంగా డిసెంబ‌రు నెల‌లో కొత్త సినిమాల సంద‌డి త‌క్కువ‌గా ఉంటుంది. ఎలాగూ సంక్రాంతి వ‌స్తుంది క‌దా.. అప్పుడు విడుద‌ల చేద్దాం అనుకొంటారు నిర్మాత‌లు. అయితే ఈ డిసెంబ‌రులో సినిమాల హ‌డావుడి కాస్త ఎక్కువ‌గానే ఉండే అవ‌కాశాలున్నాయి. అందులోనూ చిన్నా చిత‌కా సినిమాలు కావు. కొన్ని క్రేజీ ప్రాజెక్టే ఉన్నాయి. ఎవ‌డు, ఆటోన‌గ‌ర్ సూర్య‌, అనామిక‌, పైసా, ప్రతినిధి, ప్రేమ గీమ జాన్ తాన‌య్‌, ప్రేమ – కాద‌ల్ – ఇష్క్ వీటితో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాలూ వెర‌సి బాక్సాఫీసు ద‌గ్గర సంద‌డి చేయ‌బోతున్నాయి.

మా సినిమా క్రిస్మస్‌కి రావ‌డం ఖాయం.. అని దిల్ రాజు ప్రక‌టించారు. దాంతో మెగా అభిమానుల్లో సంద‌డి రెట్టింపు అయ్యింది. ఎవ‌డు సినిమాని సంక్రాంతికి వాయిదా వేస్తార‌నే ప్రచారం జ‌రిగింది. దాన్ని ఖండిస్తూ… విడుద‌ల తేదీ మ‌రోసారి ప్రక‌టించారు దిల్ రాజు. ఎవ‌డు కూడా విడుద‌లైతే ఈ యేడాది రామ్‌చ‌ర‌ణ్ చిత్రాలు మూడు విడుద‌లైన‌ట్టు. నాయ‌క్‌తో 2013ను ఘ‌నంగా ఆరంభించిన రామ్ చ‌ర‌ణ్.. ఎవ‌డుతో మంచి ముగింపు ఇస్తాడేమో చూడాలి. ఇక డ‌బ్బుల్లేక న‌త్తన‌డ‌క న‌డిచిన సినిమాలు పైసా, ఆటోన‌గ‌ర్ సూర్య కూడా డిసెంబ‌రులోనే వ‌చ్చేస్తున్నాయి. క‌హానీ రీమేక్ అనామిక పూర్తయినా శేఖ‌ర్ క‌మ్ముల విడుద‌ల చేయ‌డానికి సాహ‌సించ‌డం లేదు. డిసెంబ‌రులో మాత్రం ఈ సినిమా విడుద‌ల కావ‌డం ఖాయ‌మ‌ని చిత్రవ‌ర్గాలు చెబుతున్నాయి. అలా ఎవ‌డు, ఆటోన‌గ‌ర్‌.., పైసా, అనామిక‌ల‌తో పెద్ద సినిమాల హ‌డావుడి ఈ నెల‌లో బాగానే ఉంటుంది. అన్నట్టు ప్రతినిధి కూడా వ‌చ్చేస్తున్నా అంటున్నాడు. నారా రోహిత్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచ‌నాలున్నాయి. ఎందుకంటే ప్రచార చిత్రాలు ఇప్పటికే సంద‌డి చేస్తున్నాయి. ఈ సినిమాలో ఏదో ఉంది… అనే విష‌యం అర్థమ‌వుతోంది. ఫిల్మ్‌న‌గ‌ర్‌తో పాటు, పొలిటిక‌ల్ లీడ‌ర్లు కూడా ఈ సినిమాపై ఓ లుక్కేసే ఛాన్సుంది.

వీటితో పాటు చిన్న సినిమాలు ప్రేమ గీమా జాన్‌తా న‌య్‌, ప్రేమ ఇష్క్ కాద‌ల్ … డిసెంబ‌రులో ముహూర్తం పెట్టుకొన్నారు. దాంతో డ‌ల్ గా సాగుతుంద‌నుకొన్న డిసెంబ‌రు… హుషారు తెచ్చుకొంది. మ‌రి వీటిలో ఏ సినిమా విజ‌య తీరాల‌క చేరుతుందో ప్రేక్షకులే చెప్పాలి. ఇంత‌కీ ఈ సినిమాల్లో మీ ఛాయిస్ ఏంటి? ఏ సినిమా హిట్టవుతుంది అనుకొంటున్నారు?? తెలుగు మిర్చితో మీ అభిప్రాయాలు పంచుకోండి…! ఇప్పుడే.

Exit mobile version