‘జిందగీ’ లుక్ అదిరిపోయింది..

Dear-Zindagi-First-Lookబాలీవుడ్ కింగ్ ఖాన్ నటించిన తాజా చిత్రం డియర్ జిందగీ.. ఇంగ్లీష్ వింగ్లీష్ ఫేమ్ గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలయ్యింది. ఈ లుక్ లో షారుఖ్ అదరగొట్టాడు. 23 ఏళ్ల ఆలియా భట్ పక్కన 26 ఏళ్ల యంగ్ బాయ్ గా షారుక్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమా కోసం షారుఖ్ తన గెటప్ నే మార్చేసాడని ఈ పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది.. పూర్తిగా సన్నబడిపోగా, డిఫరెంట్ గడ్డం లుక్ & హెయిర్ స్టైల్ తో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు.

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ జనాలు ఈ సినిమా కోసం ఎంతగాను ఎదురుచూస్తున్నారు..వారి చూపులకు తెరదించాడు షారుఖ్. వచ్చే నెల 25 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ పోస్టర్ ద్వారా తెలియజేసాడు. ధర్మ ప్రొడక్షన్ ఫై గౌరి ఖాన్ , కరుణ్ జోహార్ , గౌరి షిండే లు సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించడం జరిగింది.