Site icon TeluguMirchi.com

అక్కడ స్టార్‌ హీరోల రికార్డును బ్రేక్‌ చేయబోతున్న కామ్రేడ్‌

విజయ్‌ దేవరకొండ మరికొన్ని గంటల్లో ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి భరత్‌ కమ్మ దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీస్‌ వారు ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. సౌత్‌లోని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం కలెక్షన్స్‌ అన్ని చోట్ల కూడా దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఇండియాలో ఈ చిత్రం సునాయాసంగా 100 కోట్లను రాబట్టడంతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీ ఓపెనింగ్స్‌పై కన్నేయడం జరిగింది.

మైత్రి మూవీస్‌ వారికి ఓవర్సీస్‌పై మంచి పట్లు ఉంది. దాంతో అక్కడ భారీ ఎత్తున విడుదల చేయడంతో పాటు ఎక్కువగా ప్రమోట్‌ చేస్తున్నారు. కనుక ఈ చిత్రం ఓవర్సీస్‌లో భారీగానే వసూళ్లు చేస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో కూడా అక్కడ విడుదల చేయనున్నారు. ఓవర్సీస్‌లో కేవలం ప్రీమియర్‌లతో మిలియన్‌ మార్క్‌ను చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లాంగ్‌ రన్‌ లో మూడు మిలియన్‌ల మార్క్‌ను సొంతం చేసుకోవాలని యూనిట్‌ సభ్యులు ఉబలాటపడుతున్నారు.

Exit mobile version