విజయ్ దేవరకొండ టాలీవుడ్ హీరోలందరిలో యూనిక్ అంటూ ఆయన అభిమానులు అనుకుంటూ ఉంటారు. కాని తాజాగా తన డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలైన తర్వాత తాను రొటీన్ అంటూ నిరూపించుకున్నాడు. సినిమా విడుదలకు ముందు విభిన్నంగా ప్రమోసన్ చేసిన విజయ్ దేవరకొండ సినిమా నచ్చితే చూడండి అంటూ చెప్పడం జరిగింది. కాని సినిమా ఇప్పుడు మిశ్రమ స్పందన దక్కించుకుంది. కొన్ని ఏరియాల్లో ఈ చిత్రం కలెక్షన్స్ మరీ దారునంగా ఉన్నాయి.
సినిమా ఫలితం తేడా కొట్టిందని ఇప్పటికే అర్థం అయ్యింది. అయినా కూడా నేడు సినిమా సక్సెస్ అయిన సందర్బంగా థ్యాంక్స్ అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఇతర హీరోలు మాత్రమే సినిమా ఫ్లాప్ అయినా సక్సెస్ మీట్లు చేస్తారు. కాని విజయ్ దేవరకొండ అందుకు విరుద్దం అని అనుకున్నాం. కాని విజయ్ దేవరకొండ కూడా రొటీన్ హీరోల మాదిరిగానే థ్యాంక్స్ మీట్ పెట్టి తన నైజంను బయట పెట్టుకున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.