విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని తెలుగుతో పాటు సౌత్‌లోని అన్ని భాషల్లో అంటే తమిళం, కన్నడం మరియు మలయాళంలో కూడా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఒక తెలుగు సినిమా ఏకంగా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల కావడం బాహుబలి తర్వాత ఇదే అవ్వడం విశేషం. అలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న డియర్ కామ్రేడ్ మరో అరుదైన రికార్డు ముందు నిల్చింది. నాలుగు భాషల్లో కాకుండా ఏకంగా అయిదు భాషల్లో ఈ చిత్రంను విడుదల చేయబోతున్నారు.
సౌత్‌లోని నాలుగు భాషలతో పాటు బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు కూడా ఈ చిత్రంను తీసుకు వెళ్లబోతున్నారు. నార్త్‌లో ఈ చిత్రంను చిన్నా చితకా నిర్మాత కాకుండా ఏకంగా కరణ్ జోహార్ పంపిణీ హక్కులను దక్కించుకున్నారు. హిందీ ప్రేక్షకుల ముందుకు డియర్ కామ్రేడ్‌ను కరణ్ జోహార్ తీసుకు వెళ్లబోతున్నాడు. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు ఆయన ముందుకు రావడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆనందంను వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 26న సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కాబోతుంది. అర్జున్ రెడ్డి చిత్రంతో అక్కడ మంచి క్రేజ్‌ను విజయ్ దేవరకొండ దక్కించుకున్నాడు. అందుకే డియర్ కామ్రేడ్ తప్పకుండా అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.