Site icon TeluguMirchi.com

వైజాగ్ లో కామ్రేడ్ సందడి..

విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సౌత్ నాల్గు భాషల్లో విడుదల కాబోతుండడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే టీజర్స్ , ట్రైలర్స్ తో సినిమా ఫై అంచనాలు పెంచగా..మరోపక్క చిత్ర ప్రమోషన్స్ తో ఇంకాస్త క్రేజ్ తీసుకొస్తున్నారు విజయ్..రష్మిక. ఇప్పటికే అన్ని భాషల్లో ప్రమోషన్ చేయగా..ఈరోజు వైజాగ్ లో సందడి చేయబోతున్నారు.

ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు సాయంత్రం వైజాగ్ లో జరుపబోతున్నారు. సాయంత్రం ఏడు గంటల నుండి గురజాడ కళాక్షేత్రంలో ఈ వేడుక నిర్వహించనున్నారు. నూతన దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

Exit mobile version