‘డియర్‌ కామ్రేడ్‌’ సెకండ్‌ హాఫ్‌పై అనుమానాలు?

విజయ్‌ దేవరకొండ హీరోగా భరత్‌ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంతో విజయ్‌ దేవరకొండ మరో లెవల్‌కు వెళ్లడం ఖాయం అంటూ అభిమానలు చాలా నమ్మకంగా ఉన్నారు. తాజాగా సెన్సార్‌ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ఒక పుకారు షికారు చేస్తుంది. సెన్సార్‌ బోర్డు వారు ఈ చిత్రంను చూసిన తర్వాత సెకండ్‌ హాఫ్‌ విషయంలో కాస్త పెదవి విరిచినట్లుగా తెలుస్తోంది. ఫస్ట్‌హాఫ్‌తో పోల్చితే సెకండ్‌ హాఫ్‌ కాస్త స్లోగా సాగిందని వారు అభిప్రాయ పడ్డారట.

సినిమా దాదాపుగా మూడు గంటల సమయం ఉండబోతుంది. అలాంటిది సెకండ్‌ హాఫ్‌లో స్లో కథనం ఉంటే ప్రేక్షకులు బోర్‌ ఫీల్‌ అవ్వడం ఖాయం. అదే కనుక జరిగితే సినిమాకు నష్టమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా బాగుంటే ఎంత సమయం అయినా చూడగలరు. బాలేకుంటే మాత్రం రెండు గంటలు కూడా ఎక్కువే అనుకుంటారు. అందుకే ఈ చిత్రం సెకండ్‌ హాఫ్‌ విషయంలో ఇప్పుడు వ్యక్తం అవుతున్న అనుమానాలు ఫ్యాన్స్‌ను టెన్షన్‌ పెడుతున్నాయి. అయితే ఇది కేవలం పుకార్లు మాత్రమే అయ్యి ఉంటాయని, సెన్సార్‌ బోర్డు వారి వ్యాఖ్యలు అంటూ కొందరు కావాలని పుట్టించే ప్రయత్నం చేస్తున్నారా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయం ఏంటో 48 గంటల్లో వెళ్లడయ్యేను కదా..!