Site icon TeluguMirchi.com

ఆ మూడు రాష్ట్రాల్లో కామ్రేడ్‌ పరిస్థితి దారుణం

విజయ్‌ దేవరకొండ మ్యానియా సౌత్‌ ఇండియా మొత్తం ఉందని, ఆయన అంటే యూత్‌ ఆడియన్స్‌ పడి చస్తున్నారంటూ సౌత్‌ ఇండియా మొత్తం డియర్‌ కామ్రేడ్‌ను భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది. తెలుగుతో పాటు కన్నడం, మలయాళం మరియు తమిళంలో కూడా సినిమాను నిన్ననే విడుదల చేయడం జరిగింది. సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. కనీసం కన్నడంలో అయినా ఈ చిత్రం గౌరవ ప్రధమైన వసూళ్లు రాబడుతుందేమో అనుకుంటే పరువు పోయేలా వసూళ్లు ఉన్నాయి.

రష్మిక మందన్నను చూపించి కన్నడంలో ఏకంగా నాలుగు కోట్లకు సినిమాను అమ్మేశారు. కర్ణాటకలో రష్మికకు మంచి క్రేజ్‌ ఉంది. అందుకే తప్పకుండా ఈ చిత్రం అక్కడ అంతకు మించి వసూళ్లు చేస్తుందని ఆశించారు. కాని సినిమా మాత్రం దారుణమైన ఫలితం సాదించింది. మొదటి రోజు కర్ణాటకలో కేవలం 70 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది. లాంగ్‌ రన్‌లో కోటిన్నర వరకు రాబట్టే అవకాశం ఉంది. అంతకు మించి ఈ చిత్రం రాబట్టలేదని విశ్లేషకులు అంటున్నారు. అంటే భారీ నష్టం బయ్యర్లకు తప్పదని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

Exit mobile version