విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అన్ని కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా క్యాంటీన్లోని ఒక పాట చాలా బాగా చిత్రీకరించారు. ఆ పాట మొత్తం సింగిల్ షెడ్యూల్లో చేశారు. ఆ పాట కోసం అందరు చాలా కష్టపడ్డట్లుగా కనిపించింది. అయినా కూడా ఆ పాటను సినిమా ఫైనల్ వర్షన్లో మాత్రం పెట్టలేదు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఇక వస్తుందేమో లాస్ట్‌కు వస్తుందేమో అంటూ సినిమా అంతా పూర్తి అయ్యే వరకు చూశారు.
సినిమా లెంగ్త్ అప్పటికే మూడు గంటలకు కాస్త అటు ఇటుగా ఉంది. ఆ పాటను కూడా పెడితే మరింత నిడివి ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆ పాటను తొలగించడం జరిగింది. సినిమాకు సక్సెస్ టాక్ వస్తే వారం రోజుల గ్యాప్ తర్వాత ఆ పాటను యాడ్ చేయాలని భావించారు. కాని పరిస్థితి రివర్స్ అయ్యింది. అంతా అనుకున్నట్లుగా జరగలేదు. సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో పాటు, వచ్చే వారం తర్వాత సినిమా అసలు ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.