Site icon TeluguMirchi.com

సినిమా బోర్ కొడుతుందని ఒప్పేసుకున్న విజయ్…

విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను ఏర్పటు చేసి కాస్త కలెక్షన్లు పెంచే ప్రయత్నం చేసారు చిత్ర యూనిట్.

ఇక ఈ సక్సెస్ మీట్ లో విజయ్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా చూడాలంటే ఎంతో ఓపిక ఉండాలి. ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. బాబీ, లిల్లీల జర్నీ ఇది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేసిన నేనే ఈ సినిమా చూసి ఏడ్చేసాను అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు.ఈ సినిమా కొన్ని చోట్ల బోరింగ్ ఉన్న విషయాన్ని ఒప్పుకున్నాడు.

Exit mobile version