శంక‌ర్‌పై దాస‌రి విసుర్లు

shankarభారీ చిత్రాల దర్శ‌కుడిగా, అప‌జ‌యం ఎరుగ‌ని ధీరుడిగా శంక‌ర్‌కు చాలామంచి పేరుంది. క‌థ‌లో టెక్నిక‌ల్ అంశాలు మేళ‌వించ‌డంలో ఆయ‌న‌కు సాటి మ‌రెవ్వ‌రూ లేరు. అలాంటి శంక‌ర్‌ని దాస‌రి నారాయ‌ణ‌రావు టార్గెట్ చేశారు.త‌న బొబ్బిలి పులి క‌థ‌నే శంక‌ర్ భార‌తీయుడిగా తీశాడ‌ని విమ‌ర్శించారు. అంతేకాదు… శంక‌ర్ పేరు లేని ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర ప‌నిచేశాడ‌ని.. ఆయ‌న‌తో పోలిస్తే తెలుగులో గొప్ప ద‌ర్శ‌కులు ఎంతోమంది ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. దాస‌రి వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. `మీ అభిమాన ద‌ర్శ‌కుడెవ‌రు?` అని అడిగితే.. ప‌రాయి భాషా చిత్రాల ద‌ర్శ‌కుల పేర్లు చెబుతున్నార‌ని, అంత‌కంటే దౌర్భాగ్యం మ‌రోటి లేద‌ని విమ‌ర్శించారు దాస‌రి. అంతే కాదు త‌న శ్రీ‌వారి ముచ్చ‌ట్లు సినిమా ఈవీవీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాగా తీశార‌ట‌. మేఘ‌సందేశం కూడా ఆనంద‌భైర‌విగా మార్చార‌ట‌. స‌డ‌న్‌గా పాత సినిమాలు ఇప్పుడెందుకు గుర్తొచ్చాయో దాస‌రికి.