Site icon TeluguMirchi.com

‘దసరా’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..


నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ దసరా పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా రోజురోజుకు విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మార్చి 14వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈమేరకు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా నాని కెరీర్ లోనే ఇది తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు భారీగానే వున్నాయి మరి.

Exit mobile version