Site icon TeluguMirchi.com

దసరా ట్రైలర్ : నిజమే… కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమానే

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా మూవీ మార్చి 30న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. నానికి ఇది తొలి పాన్ ఇండియన్ మూవీ. తాజాగా ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది.

ఈ సినిమా గురించి నాని ఎప్పుడు మాట్లాడినా కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా ‘దసరా’ అని చెబుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ చూస్తే నాని చెబుతున్నది నిజమే అనిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్, నేపధ్యం, ఇలా అన్నీ చాలా గ్రాండ్ గా వున్నాయి. నాని మాస్ అవతార్ లో సరికొత్తగా మునుపెన్నడూ లేని విధంగా కనిపించారు. నాని ఇంత మాస్ రోల్ లో చూసి ఫ్యాన్స్ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. ఇక నటనలో అయితే తన విశ్వరూపం చూపించాడు నాని. సంగీతం, కెమరాపనితనం, విజువల్స్, టేకింగ్, మేకింగ్ ఇలా అన్నీ టాప్ క్లాస్ లో వున్నాయి. ఇదే ఎమోషన్ సినిమాలో కూడా కనిపిస్తే.. నానికి తొలి పాన్ ఇండియా హిట్ పడిపోయినట్లే.

Dasara Trailer | Nani | Keerthy Suresh | Santhosh  Narayanan | Srikanth Odela | SLV Cinemas

Exit mobile version