అప్పుడే ఓటీటీలోకి ‘దసరా’..


నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన పాన్ ఇండియా మూవీ ‘ద‌స‌రా’ మార్చి 30న థియేట‌ర్ల‌లో విడుదలై సంచలనం సృష్టించింది. ఎన్నో ఏళ్లుగా కమర్షియల్ సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్న నానికి దసరా అలాంటి విజయాన్నే అందించింది. ఈ సినిమాతో నాని వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు. ఇక దర్శకుడు శ్రీకాంత్‌ తొలి సినిమాకే ఈ రేంజ్‌ అవుట్‌ పుట్‌ ఇచ్చాడంటే మాములు విషయం కాదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఏప్రిల్‌ 27 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారకంగా ప్రకటించింది. ఇక తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషలకు సంబంధించి స్ట్రీమింగ్ కానుంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కన్నడ నటుడు దీక్షిత్‌ శెట్టి, సముద్రఖని, సాయికుమార్‌, షైన్‌ టామ్‌చాకో కీలకపాత్రల్లో నటించారు.