విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ క ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు శిల్పకళా వేదికలో జరిగింది. ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఈ రోజు ప్రపంచ పటంలో నిలబడింది, ఆస్కార్ అవార్డ్ వచ్చింది అంటే.. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా అంతే కారణం. అలాగే యావత్ తెలుగు జాతి కారణం.. అభిమానుల అభిమానం కారణం. ఆర్ ఆర్ ఆర్ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఆస్కార్ వేదిక పై చంద్రబోస్, కీరవాణి లను చూసినప్పుడు ఇద్దరు భారతీయులు ఆ అవార్డ్ తీసుకున్నారు అనిపించింది. ఇక ఆర్ ఆర్ ఆర్ ని ప్రతి ఒక్కరు తమ సినిమా గా భావించారు.
విశ్వక్ సేన్ సినిమాలు నాకు చాలా ఇష్టం. తనను తాను ప్రూవ్ చేసుకోవాలని తపన పడుతూ ఉంటాడు. ఈ సినిమాకి డైరెక్టేర్ గా కూడా అతనే చేసాడు. ఇక ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తాను డైరెక్ట్ చేయకుండా ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. తెలుగు పరిశ్రమ అద్భుతమైన స్థానంలొ ఉంది. ఈ సినిమా ఉగాది కి రిలీజ్ అవుతుంది. విశ్వక్ సేన్ కి పండుగ అవ్వాలి ఈ సినిమా అని కోరుకుంటున్నాను” అన్నారు.