‘దాస్ కా ధమ్కీ’ ఓటీటీ రిలీజ్ ఆరోజే !


యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా అందాల నటి నివేతా పేతురాజ్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన దాస్ కా ధమ్కీ బాక్స్ఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించాడు. రావ్ రమేష్, హైపర్ ఆది, రోహిణి కీలకపాత్రలు పోషించారు. ఇక లియోన్ జేమ్స్, రామ్ మిరియాల సంగీతం అందించారు.

ఈ మూవీలో విశ్వక్ డ్యుయల్ రోల్ పోషించాడు. ఈ రెండూ ఒకదానికొకటి పూర్తి భిన్నమైన పాత్రలు. ఈ రెండింట్లోనూ అతడు తన యాక్టింగ్ తో మెప్పించాడు. కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కించాడు విశ్వ‌క్‌సేన్‌. ఇకపోతే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఏప్రిల్ 14న ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా లో ప్రసారం కానుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆహా టీమ్ నుండి అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. మరి ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.