Site icon TeluguMirchi.com

సూపర్ స్టార్ సినిమా వాయిదా పడబోతుందా..?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమా రిలీజ్ వాయిదా పడబోతుందా..? ఇప్పుడు ఇదే కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో రజనీకాంత్ – నయనతార జంటగా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 09 న తెలుగు , తమిళ్ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అప్పుల కారణంగా సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తుంది.

దర్బార్‌ రిలీజ్‌ను ఆపాలంటూ దాఖలైన పిటీషన్‌పై స్పందించాలంటూ మద్రాసు హైకోర్టు లైకా ప్రొడక్షన్స్‌కు నోటీసులు పంపింది. గతంలో 2.ఓ సినిమా నిర్మాణంలో ఉండగా లైకా సంస్థ, మలేషియాకు చెందిన ఎంటర్‌టైన్మెంట్‌ కంపెనీ డీఎంవై క్రియేషన్స్‌ నుంచి 12 కోట్లు అప్పుగా తీసుకుంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవటంతో ఇప్పుడు వడ్డీతో కలిపి 23 కోట్ల 70 లక్షలు అయ్యింది. ఆ మొత్తాన్ని చెల్లించే వరకు దర్బార్‌ రిలీజ్‌ ఆపాలంటూ డీఎంవై సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. మరి లైకా ఏం చేస్తుందో చూడాలి.

Exit mobile version