దర్బార్ ఫస్ట్ లుక్..ఈ వయసు లోను రజనీ కేక పుట్టిస్తున్నాడు..

‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌, నయనతార జంటగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్‌’. ఈ చిత్రంలో రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ ముంబై లో శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా రజనీకాంత్ పోలీస్ గెటప్ లో ఉన్న పిక్ బయటకొచ్చి వైరల్ కాగా.. తాజాగా చిత్ర యూనిట్ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.

పోలీస్ గెటప్లో రజనీకాంత్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. 68ఏళ్ల వయసులో కూడా రజనీ స్టైల్ చూస్తుంటే ఆయనని స్టైల్ కు ఆయనే సాటి అనకుండా ఉండలేరు. రజనీ చాల యంగ్ గా కనిపిస్తూ..చాల స్టైలిష్ గా ఉండడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముంబై బ్యాక్‌డ్రాప్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రజనీకాంత్‌కు కుమార్తెగా నటి నివేదా థామస్‌ నటిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తుండగా.. .లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. 2020 పొంగల్(సంక్రాంతి)కి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.