Site icon TeluguMirchi.com

దర్బార్ సెన్సార్ రిపోర్ట్..

సంక్రాంతి బరిలో అల..వైకుంపురం లో , సరిలేరు నీకెవ్వరూ తో పాటు దర్బార్ , ఎంత మంచివాడవు రా చిత్రాలు కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. అందరి కంటే ముందు రజనీకాంత్ దర్బార్ తో సంక్రాంతి సందడిని మొదలు పెట్టబోతున్నాడు. తెలుగు , తమిళ్ భాషల్లో ఈ మూవీ జనవరి 09 న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకుంది.

సినిమాను చూసిన సెన్సార్ బృందం సినిమాకు క్లిన్ యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే చిత్ర రన్ టైం ను 2 గంటల 39 నిమిషాలగా తేల్చింది. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో రజనికి జోడిగా నయనతార నటిస్తుండగా.. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి నటిస్తున్నాడు. నివేద థామస్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.

Exit mobile version