Site icon TeluguMirchi.com

‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ నుండి ‘డేంజర్ పిల్ల’ రిలీజ్ ఆరోజే !


హీరో నితిన్ తాజాగా నటిస్తున్న మూవీ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా నుండి రిలీజైన నితిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు మేకర్స్.

ఈ సినిమా నుండి ‘డేంజర్ పిల్ల..’ అనే పాటను ఆగష్టు 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ పోస్టర్ చూస్తుంటే సాంగ్ చాలా రిచ్ గా షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక హరీశ్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 23వ తేదీన విడుదల కానుంది.

Exit mobile version