నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ బీట్ పేరుతో వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఫస్ట్ బీట్ వీడియోను గమనిస్తే.. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్న, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కించారు. టెక్నాలజీ పరంగా ఎన్నో మలుపులు తీసుకుని ముందుకెళుతోన్న నేటి సమాజంలో ఇప్పటికీ ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయా? అని ఫస్ట్ బీట్ వీడియోను గమనిస్తుంటే ఆశ్చర్యమిస్తోంది.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
నటీనటులు:
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు
A riveting tale of Love, Humor, Pride, and Culture! #Dhandoraa 🥁 First Beat Out Now 💥@Afilmby_Murali @Benny_Muppaneni @itsmaniika @ActorSivaji @pnavdeep26 @ActorNandu #RaviKrishna #Mounika @Raadhya33 @aneeshmarisetty @iamMarkKRobin @kranthipriyam #VenkatRshakamuri pic.twitter.com/BogqLrdrjF
— Loukya entertainments (@Loukyaoffl) February 21, 2025