బాద్ షా కు మెహందీ అద్దుతున్న తమన్

dalerశీను వైట్ల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ బాద్ షా. పూర్తి కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ఎన్నో క్రేజీ అంశాలు వున్న ఈ చిత్రంలో మరో విశేషం వచ్చి చేరింది. యమదొంగ చిత్రంలో ‘రబ్బరు గాజులు’ పాట పాడిన దలేర్ మెహందీ.. ఎన్టీఆర్ బాద్ షా కోసం మరోసారి మైక్ పట్టనున్నాడు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ లో తెలిపాడు ‘యమదొంగ’ చిత్రంలో ‘రబ్బరు గాజులు’ పాటకు ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. కీరవాణి ఈ పాటను దలేర్ మెహందీ ఫ్లేవర్ కు తగిన విధంగా కంపోజ్ చేసిన విధానం హైలెట్. ఈ పాటకు ఎన్టీఆర్ చేసిన డాన్సు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మరోసారి ఆ కాంబినేషన్ రీపీట్ అవుతుంటే అభిమానుల్లో ఈ సాంగ్ పై అంచానాలు పెరగడం సహజం. తమన్ కు దలేర్ మెహందీ మొదటి సాంగ్ ఇదే. ఈ పాటను ఏ స్థాయి లో కంపోజ్ చేస్తాడో అని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ పాటకు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందిస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో శింబు.. బాద్ షా కు ఓ సాంగ్ పాడిన సంగతి తెలిసిందే. శరవేగంగా రీ రికార్డింగ్ పనులు జరుగుతున్న ఈ చిత్రం ఆడియో ను మార్చి 10 రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.