దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో.. ఉత్తమ నటీనటులుగా భార్యాభర్తలకి అవార్డులు


ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2023 సోమవారం రాత్రి ముంబయిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో 2022 ఏడాదికి సంబంధించి భారతీయ చిత్రాలకు పురస్కారాలు అందించారు. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌కి `బ్రహ్మాస్త్ర` చిత్రానికి, ఉత్తమ నటిగా అలియాభట్‌కి `గంగూభాయ్‌ః కథియవాడి` చిత్రానికి గానూ అవార్డులు వరించాయి. ఉత్తమ నటీనటులుగా భార్యాభర్తలకే అవార్డులు దక్కడం విశేషం. మరోవైపు రణ్‌బీర్‌ కపూర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన అవార్డుని కూడా ఆయన భార్య అలియాభట్‌ అందుకున్నారు.

ఇక ఉత్తమ చిత్రంగా కశ్మీర్ ఫైల్స్ అందుకోగా.. బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా ‘ఆర్ఆర్ఆర్’ అవార్డు అందుకుంది. మోస్ట్ ప్రామిసింగ్‌ యాక్టర్‌గా `కాంతార` ఫేమ్‌ రిషబ్‌ శెట్టి ని పురస్కారం వరించింది. భేడియా సినిమాలో వరుణ్ ధావన్ పాత్రకు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. అదే సమయంలో ది కశ్మీరీ ఫైల్స్ సినిమాలో అనుపమ్ ఖేర్ నటనకు మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ అవార్డు దక్కింది. ఈ వేడుకలో బాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. అలాగే చిత్ర పరిశ్రమకు సేవలందించినందుకుగాను దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డుని అలనాటి తార రేఖ అందుకున్నారు.

ఇక అవార్డుల వివరాలు చూస్తే,
ఉత్తమ చిత్రం.. ది కశ్మీర్ ఫైల్స్
ఉత్తమ దర్శకుడు.. ఆర్.బల్కీ (చుప్: ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్)
ఉత్తమ నటుడు.. రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర-1)
ఉత్తమ నటి.. ఆలియా భట్ (గంగూభాయి కతియావాడి)
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్.. రిషబ్ శెట్టి (కాంతారా)
క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్.. వరుణ్ ధావన్ (బేడియా)
మోస్ట్ వెర్సటైల్ యాక్టర్.. అనుపమ్ ఖేర్
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్.. సాచిత్ తాండన్
క్రిటిక్స్ ఉత్తమ నటి.. విద్యా బాలన్ (జల్సా)
ఉత్తమ సహాయ నటుడు.. మనీష్ పాల్ (జగ్ జగ్ జీయో)
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్.. ఆర్ఆర్ఆర్