Site icon TeluguMirchi.com

ఐ యామ్ సారీ బాబ్జీ

d v v danayyaవి. వి. వినాయక్‌ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరో గా విడుదలైన చిత్రం నాయక్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు ముందు కనక వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో గండి బాబ్జి క్యారెక్టర్ మొదటి నుండి వివాదాస్పదమౌతూ వచ్చింది. కావాలనే తన ఇమేజ్ ను డామేజ్ చేయడానికే తన పేరును ఓ విలన్ క్యారెక్టర్ కు పెట్టారని విశాఖకు చెందిన మాజీ ఎమ్మల్యే గండి బాబ్జి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో నిర్మాత డి వి వి దానయ్య ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోమాట్లాడుతూ… మా సినిమా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెలుతోందని….10 రోజుల కలెక్షన్లలో సరికొత్త రికార్డ్ సృష్టించిందని అన్నారు. ఇక ‘నాయక్’ సినిమాలో విలన్ పాత్రకు విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు పెట్టడంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు… దానయ్య స్పందిస్తూ ఉద్దేశ్య పూర్వకంగా ఆయన పేరు పెట్టలేదని, యాదృచ్చికంగా జరిగిందేనన్నారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు బాబ్జీకి క్షమాపణ చెబుతున్నట్లు దానయ్య మీడియా ముఖంగా స్పష్టం చేశారు.

Exit mobile version