Site icon TeluguMirchi.com

టీజర్ టాక్ : చైతన్య ‘కస్టడీ’లోకి తీసుకుంది ఎవరిని?


అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో చిత్రం ‘కస్టడీ’. తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. నాగ చైతన్య వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళుతుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ నన్ను చావు వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో ఎప్పుడు , ఎలా వస్తుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో వున్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్.. దట్ ట్రూత్ ఈజ్ ఇన్ మై కస్టడీ’’ అనే వాయిస్ ఓవర్ ఆసక్తికరంగా వుంది.

నాగ చైతన్య తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తోఆకట్టుకున్నారు. అరవింద్ స్వామి తన విలనీ యాక్టింగ్‌తో క్యారెక్టర్‌కి ఎక్స్‌ట్రా ఇంటెన్సిటీని తీసుకొచ్చాడు. వెంకట్ ప్రభు మరో యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చారని టీజర్ భరోసా ఇచ్చింది. మే 12, 2023న ఈ సినిమా విడుదల కానుంది.

Custody Teaser (TELUGU) | Naga Chaitanya | Krithi Shetty | Arvind Swami | Venkat Prabhu

Exit mobile version