Site icon TeluguMirchi.com

‘కస్టడీ’ టీజర్ డేట్ ఫిక్స్..!


అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్-లుక్ పోస్టర్లు, గ్లింప్స్ కు అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా ఈ నెల 16న సాయంత్రం 4:51 గంటలకు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. టీజర్ తేదీని అనౌన్స్ చేయడానికి, ఆసక్తిని పెంచడానికి టీజర్ టీజ్ ని విడదల చేశారు. నదిలో జైలు..ఆ జైలు నుంచి తనని తాను విడుపించుకొని బయటికి వస్తున్న నాగచైతన్య వీడియో చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ టీజ్ వీడియోలో నాగచైతన్య ఖాకీ యూనిఫామ్‌లో కనిపించారు.

ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు. ఇక మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Exit mobile version