చిత్రం: కస్టడీ
తెలుగుమిర్చి రేటింగ్: 2.5/5
నటీనటులు: నాగ చైతన్య అక్కినేని, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: ఎస్ఆర్ కతీర్
ఎడిటర్: వెంకట్ రాజన్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్‌ప్రభు
విడుదల తేదీ: మే 12, 2023
అక్కినేని నాగచైతన్య గతేడాది నటించిన ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలు నిరాశపరచడంతో తాజా సినిమా ‘కస్టడీ’ పై భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతిశెట్టి కథానాయకిగా నటించింది. నాగచైతన్య కెరీర్‌లోనే భారీ వ్యయంతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తను పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించారు. మరి ఈ చిత్రం అక్కినేని హీరోకి ఎలాంటి హిట్ అయ్యింది?చైతన్యకు తమిళంలో కస్డడీ మంచి ఎంట్రీ అయ్యిందా? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ :
శివ(నాగచైతన్య) నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్. డ్యూటీ అంటే ప్రాణం పెడతాడు. మరోవైపు రేవతి (కృతి శెట్టి) తో ప్రేమలో ఉంటాడు. రేవతి కూడా శివని ప్రాణంగా ప్రేమిస్తోంది. అయితే కులాలు వేరు కావడంతో రేవతి ఇంట్లో శివతో పెళ్లికి ఒప్పుకోరు. అదే సమయంలో ఓ రోజు రాత్రి ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటుంటారు. వారిద్దరినీ శివ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో వేస్తాడు. అందులో ఒక వ్యక్తి తన పేరు జార్జ్ (సంపత్ రాజ్) అని, తనొక సీబీఐ ఆఫీస్తర్ అని.. తను గొడవపడ్డ వ్యక్తి రాజశేఖర్ అలియాస్ రాజు (అరవిందస్వామి) పెద్ద క్రిమినల్ అని చెబుతాడు. కావాలంటే పై ఆఫీసర్స్ కు ఫోన్ చేసి కనుక్కోమంటాడు. దాంతో శివ పై అధికారులకు ఫోన్ చేస్తాడు. తరువాత శివ కస్టడీలో ఉన్న రాజును చంపేందుకు పోలీస్ కమీషనర్ నటరాజన్ (శరత్ కుమార్) సహా ఏకంగా పోలీస్ ఫోర్స్, రౌడీలు రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో ఏం జరిగింది? రాజుని చట్టానికి పట్టించే క్రమంలో శివకు ఎదురైన సమస్యలేమిటి? ఇంతకు శివ తన ప్రేమ సమస్యను పరిష్కరించుకోగలిగాడా? అనేది మిగిలిన కథ.
పెర్ఫార్మన్స్ :
నాగచైతన్య పోలీస్ కానిస్టేబుల్ గా తన పాత్రలో ఒదిగిపోయారు. పైగా తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో నాచైతన్య చాలా సెటిల్డ్ గా నటించాడు. ఇటు హీరోయిన్ కృతి శెట్టి తో ప్రేమ సన్నివేశాల్లో గాని, అటు యాక్షన్ సన్నివేశాల్లో గాని నాగచైతన్య నటన బాగుంది. హీరోయిన్ కృతి శెట్టి తన పాత్రకు తగ్గ అభినయం ప్రదర్శించారు. అరవింద్ స్వామి ‘ధ్రువ’ తరువాత మరోమారు తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఉన్నంతలో ఈ పాత్రే చివరిదాకా ఉండి క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తుంది. ఇక వెన్నెల కిశోర్ హాస్యం కాసింత రిలీఫ్ ఇస్తుంది. ప్రియమణి పాత్ర ఫర్వాలేదనిపించింది. శరత్‌కుమార్ తనదైన నటనతో మెప్పించాడు. మిగతా పాత్రలు తమ పరిధుల మేరకు ఆకట్టుకుంటాయి. యువన్ శంకర్, ఇళయరాజా- ఒకరు కాదు ఇద్దరు ఉద్దండ సంగీత దర్శకులు ఉన్నప్పటికీ పాటలు ఆకట్టుకునేలా లేవు. నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. వెంకట్‌ప్రభు సినిమాల్లో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా నిలుస్తుంటుంది. అయితే ఈ సినిమాలో ఆయన తన మ్యాజిక్‌ను చూపించలేకపోయాడు. కథ సింపుల్ గా ఉండటం, స్క్రీన్ ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఇకపోతే నిర్మాణ విలువలు బాగున్నాయి.
పాజిటివ్స్ :
నాగచైతన్య, అరవింద్ స్వామి, శరత్ కుమార్ నటన
యాక్షన్ ఎపిసోడ్స్
ప్రొడక్షన్ వాల్యూస్
నెగటివ్స్ :
అలరించని పాటలు
హీరో, హీరోయిన్ ల లవ్ ట్రాక్
సాగదీతలా వుండే సీన్స్