ఆగస్ట్ లో కరెంట్ తీగ

current
మంచు మనోజ్ లేటెస్ట్ చిత్రం ‘కరెంట్ తీగ’. మనోజ్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సీమశాస్త్రి’, ‘దేనికైనా రెడీ’ సినిమాల దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి దర్శకుడు. హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియోని ఆగష్టులో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ ఉంటున్న ఈ సినిమాలో మనోజ్ పాత్ర బాగా ఎనర్జిటిక్ తీర్చిదిద్దుతున్నారు. సెప్టెంబర్ లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.