Allari Naresh : అల్లరి నరేష్ నెక్స్ట్ మూవీకి క్రేజీ టైటిల్..


హీరో అల్లరి నరేష్ తన 63 వ చిత్రం కోసం ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ దర్శకుడు సుబ్బు మంగాదేవితో చేతులు కలిపారు. బ్లాక్ బస్టర్ ‘సామజవరగమన’ చిత్రాన్ని అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రోజు, మేకర్స్ #N63 టైటిల్‌ను అనౌన్స్ చేశారు.

ఈ చిత్రానికి ‘బచ్చల మల్లి’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్‌లో పూర్తిగా లోడ్ చేయబడిన ట్రాక్టర్ లోయలో పడిపోతున్నట్లు కనిపిస్తోంది. ట్రాక్టర్‌పై టైటిల్ రాసి ఉంది. టైటిల్ పోస్టర్ ద్వారా సినిమాలో యాక్షన్‌ ఎక్కువగా ఉంటుందని అర్ధమౌతోంది. ఇకపోతే ‘బచ్చల మల్లి’ ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు ప్రతాప్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, అనిల్ రావిపూడి క్లాప్‌ ఇచ్చారు. విజయ్ కనకమేడల తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.

అల్లరి నరేష్ కు జోడిగా అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట జయరామ్, రావు రమేష్, సాయి కుమార్, ధనరాజ్, హరితేజ లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. కథ, సంభాషణలు సుబ్బు స్వయంగా అందించారు. కాగా ఈ చిత్రం 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది.