ఆరేళ్లుగా సాగుతున్న కేసుకు ఇప్పుడు ఫైనల్ ఇయరింగ్ వచ్చింది. బాలీవుడ్లో వచ్చిన ‘బ్యాండ్ బాజా బరాత్’కు అనధికారిక రీమేక్ అని, తమ కథను అనుమతి లేకుండా కాపీ కొట్టారు అంటూ యశ్ రాజ్ ఫిల్మ్ వారు కోర్టులో కేసు ఫైల్ దాఖలు చేయడం జరిగింది. అది ఇన్నాళ్లు కొనసాగి ఇప్పుడు తుది తీర్పు వచ్చింది. జబర్దస్త్ చిత్రాన్ని ఎక్కడ ప్రదర్శించవద్దని, టీవీల్లో కూడా ఆ సినిమాను ప్రదర్శించేందుకు వీలు లేదు అంటూ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ చిత్రం ఎక్కడికి అక్కడ బ్యాన్ అవ్వనుంది.