సమంత ఆరేళ్ల క్రితం సినిమాకు ఇప్పుడు కోర్టు షాక్‌

సమంత హీరోయిన్‌గా సిద్దార్థ హీరోగా తెరకెక్కిన ‘జబర్‌దస్త్‌’ చిత్రం గురించి ప్రేక్షకులు మర్చి పోయి ఉంటారు. ఎందుకంటే ఆ సినిమా సక్సెస్‌ కూడా అవ్వలేదు. ‘అలామొదలైంది’ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అవ్వడం వల్ల ఆ సినిమా గురించి అంతా అనుకున్నారు. కాని ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఆ సినిమా ఎందుకు చేసి ఉంటామా అని సమంత కూడా అనుకుని ఉంటుంది. అటువంటి సినిమాపై ఇప్పుడు హైకోర్టు స్టే విధించింది.

ఆరేళ్లుగా సాగుతున్న కేసుకు ఇప్పుడు ఫైనల్‌ ఇయరింగ్‌ వచ్చింది. బాలీవుడ్‌లో వచ్చిన ‘బ్యాండ్‌ బాజా బరాత్‌’కు అనధికారిక రీమేక్‌ అని, తమ కథను అనుమతి లేకుండా కాపీ కొట్టారు అంటూ యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ వారు కోర్టులో కేసు ఫైల్‌ దాఖలు చేయడం జరిగింది. అది ఇన్నాళ్లు కొనసాగి ఇప్పుడు తుది తీర్పు వచ్చింది. జబర్‌దస్త్‌ చిత్రాన్ని ఎక్కడ ప్రదర్శించవద్దని, టీవీల్లో కూడా ఆ సినిమాను ప్రదర్శించేందుకు వీలు లేదు అంటూ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ చిత్రం ఎక్కడికి అక్కడ బ్యాన్‌ అవ్వనుంది.