Court : నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించి అధికారక ప్రకటన వచ్చేసింది.
Also Read : Peddi First Shot : దేవర రికార్డు చెరిపేసిన ‘పెద్ది’
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు నెట్ ఫ్లిక్స్ పేర్కొంది. ఇకపోతే రూ. 10 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 50 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది. కంటెంట్ ఉంటే చాలు ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది.
Also Read : Seetha Payanam : మామ డైరక్షన్ లో అల్లుడు పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ !