కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు అందర్నీ మడతపెడుతుంది. ప్రధాని దగ్గరి నుండి పేద వాడి వరకు ఈ కరోనా మహమ్మారికి చిక్కుతునే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నిర్మాత కూతురి కి కరోనా సోకినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరీం మొరాని కుమార్తె షాజా మొరాని కరోనా బారిన పడింది.
షాజా మొరాని ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి ముంబైకి వచ్చింది. రెండు రోజులుగా జ్వరం దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు చేయగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. కొంతకాలంగా ఈమె ప్రియాంక్ శర్మతో డేటింగ్ కొనసాగిస్తోంది.తాజాగా ప్రియాంక్ శర్మతో కలిసి ఆస్ట్రేలియాలో పర్యటించి ముంబై వచ్చింది. ఇప్పుడు షాజాకు కరోనా సోకడం తో ఆమె ప్రియుడు ప్రియాంక్ కు కూడా కరోనా టెస్టులు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.