కరోనా బారిన పడ్డ ప్రముఖ నిర్మాత

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన ఎక్స్ ప్రెస్ , రా వన్ చిత్రాలను నిర్మించిన నిర్మాత కరీం మొరానీ కు కరోనా సోకినట్లు తెలుస్తుంది. రీసెంట్ గా విదేశాల నుండి వచ్చిన కరీం మొరానీ కుమార్తెలకి కరోనా పాజిటివ్ రావడంతో వారికీ చికిత్స అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరీంకి కూడా పాజిటివ్ లక్షణాలు ఉండడంతో, ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆయనకు కూడా పాజిటివ్ అని తేలింది. దాంతో బాలీవుడ్ జనాలు భయాందోళనకు గురవుతున్నారు. వీరు మాత్రమేనా ఇంకోవరికైనా పాజిటివ్ వచ్చిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై లో కరోనా మహమ్మారి విజ్ర్బిస్తుంది. ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడ్డారు.