ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా హిట్ అయితే పర్వాలేదు. కాని ఫ్లాప్ అయితే వచ్చే ట్రోల్స్‌కు యూనిట్ సభ్యులు జుట్టు పీక్కోవాల్సిందే. సినిమాకు సంబంధించిన ప్రతి పాయింట్‌ను తీసుకుని విశ్లేషిస్తూ రచ్చ రచ్చ చేసేందుకు కొందరు రెడీగా ఉంటారు. ఇప్పుడు అదే పరిస్థితి సాహోకు కనిపిస్తుంది. సాహోకు సంబంధించిన పలు సీన్స్ కాపీ అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
పాత యాక్షన్ సినిమాలను, హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన సీన్స్‌ను కాపీ చేసి ఈ చిత్రంలోని పలు సీన్స్ చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్ ఇంట్రో సీన్ కూడా ఒక హాలీవుడ్ సినిమా నుండి డైరెక్ట్‌గా ఎత్తేశారు. ఏమాత్రం మార్పులు చేయకుండా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో సీన్స్ కాపీనే. యాక్షన్ సీన్స్ కూడా హాలీవుడ్ నుండి ఎత్తేసినవే. దాదాపుగా 80 శాతం సీన్స్ కాపీనే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఫ్లాప్ అయ్యి జట్టు పీక్కుంటున్న యూనిట్ సభ్యులు ఈ పరిణామంతో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.