వెనక్కు తిరుగు అని మరీ ఎన్టీఆర్‌ తన్నారు : వేణుమాధవ్‌

ntr sr (2)కొన్ని సంవత్సరాల ముందు వరకు టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న వేణు మాధవ్‌కు ప్రస్తుతం అవకాశాలు లేవు. దాంతో అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి తాను ఒకడిని ఉన్నాను అంటూ ప్రేక్షకులకు గుర్తుకు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల తాను చనిపోయాను అంటూ వార్తలు రాస్తున్నారంటూ కంట తడి పెట్టుకున్న వేణుమాధవ్‌ తాజాగా తనను సీనియర్‌ ఎన్టీఆర్‌ కాళుతో తన్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన వేణుమాధవ్‌ మాట్లాడుతూ.. తాను సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు తెలుగు దేశం పార్టీ ఆఫీస్‌లో జాబ్‌ చేశాను. టెలిఫోన్‌ ఆపరేటర్‌గా నెలకు 600 జీతంతో ఉద్యోగం చేశాను. ఆ సమయంలో కొన్ని సార్లు ఎన్టీఆర్‌ ఇంటి వద్ద కూడా తనకు డ్యూటీ వేసేవారు. ఒకరోజు రాత్రి డ్యూటీ ఎన్టీఆర్‌ ఇంట్లో చేశారు. ఆయన అన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. నేను పడుకునే సమయంలో లైట్‌ బంద్‌ చేయలేదు. ఆ విషయాన్ని ఆయన కనిపెట్టారు. దాంతో తెల్లవారు జామున పిలిచి వెనక్కు తిరగమని మరీ కాలుతో తన్నాడు. ఆ తర్వాత విషయం అర్థం అయ్యింది.

కొంత సమయం తర్వాత ఎన్టీఆర్‌ పిలుస్తున్నాడు అంటూ ఒక వ్యక్తి నా వద్దకు వచ్చాడు. మళ్లీ ఏమయ్యిందో అనుకుంటూ భయంగానే వెళ్లాను. అప్పుడు ఆయన దోశ తింటున్నాడు. తన ప్లేట్‌లో ఉన్న ఒక దోశను నాకు ఇచ్చి తినమన్నారు. ఏం బ్రదర్‌ జాగ్రత్తగా ఉండాలి కదా అన్నారు. అప్పుడు తాను సరే అన్న గారు అంటూ తలూపాను. ఇంకా ఏమైనా తింటారా అంటూ ఆప్యాయంగా మాట్లాడారు అంటూ వేణుమాధవ్‌ అప్పటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.