వరుణ్‌, వితిక గొడవ.. బిగ్‌బాస్‌ డ్రామా

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఆరవ వారంలో అడుగు పెట్టింది. వరుసగా నాలుగు వారాల పాటు షోకు దారుణమైన రేటింగ్‌ వస్తోంది. రేటింగ్‌ను ఎలాగైనా పెంచాలని ఇంటి సభ్యుల మద్య గొడవ పెట్టడం, వారిలో వారు కొట్టుకోవడం వంటివి చేస్తున్నారు. బిగ్‌బాస్‌ నిన్నటి ఎపిసోడ్‌పై సర్వత్రా ఆసక్తి కలిగించాడు. నిన్న ఉదయం విడుదలైన ప్రోమోలో వరుణ్‌ మరియు వితికలు చాలా సీరియస్‌గా గొడవ పడటం చూపించారు. దాంతో రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు అంతా కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు.

షో ప్రారంభం అయిన తర్వాత అసలు విషయం తెల్సిందే. అది కేవలం సీక్రెట్‌ టాస్క్‌లో భాగమే అని, అందుకోసం వరుణ్‌ చాలా సీరియస్‌గా వితికపై రియాక్ట్‌ అయ్యాడంటూ తేలిపోయింది. మొహంపై కాఫీ పోడం నుండి ఇంకా ఆమె డ్రస్‌ చించేయడం వరకు అంతా కూడా సీక్రెట్‌ టాస్క్‌లో భాగంగానే జరిగింది. ఆ గొడవం అంతా కూడా బిగ్‌బాస్‌ డ్రామా అని ప్రేక్షకులకు తేలిపోయింది. ఎంతో ఉత్కంఠను రేపిన గొడవ నీటిపై రాత మాదిరిగా ఊరికే చెదిరిపోయింది.