దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బుసలు కొడుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 5న దేశ వ్యాప్తంగా ప్రజలంతా దీపాలు వెలిగించాలని కోరారు. ఈ పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఆదివారం (ఏప్రిల్ 5న) రాత్రి 9 గంటలకు విద్యుత్ బల్బులను ఆపివేసి.. దీపాలను, టార్చ్‌లను వెలిగించారు. 9 నిమిషాల పాటు ఈ దీపాలను వెలిగించి కరోనా చీకట్లను తరిమికొట్టారు. చిన్న , పెద్ద , పేద , ధనిక ఇలా ఏ బేధం లేకుండా ప్రతి ఒక్కరు దీపాలను వెలిగించి ఐక్యతను చాటుకున్నారు.
ఇక సినీ ప్రముఖులు సైతం మోడీ పిలుపు కు మద్దతుగా తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి ఆకట్టుకున్నారు. చిరంజీవి తన కుటుంబంతో కలిసి ఇంటి ముందు దీపాలు పట్టుకుని నిలబడ్డారు. అలాగే అల్లు అర్జున్, అల్లు అరవింద్ లు కూడా తన ఫ్యామిలీతో దీపాలు వెలిగించారు. వెంకటేష్ దీపాలను లాంథర్‌లో పట్టుకుని బాల్కనీలోకి వచ్చారు. నాగార్జున తన భార్య అమల, కుమారుడు అఖిల్‌తో కలిసి దీపాలను వెలిగించారు. మహేష్ బాబు, విష్ణు , మనోజ్ లు కూడా దీపం వెలిగించారు. రజినీకాంత్ తన భార్యతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి ఆ ఫొటోలను ట్వీట్ చేశారు. రాశీ ఖన్నా, గోపీచంద్, మంచు లక్ష్మి, తమన్నా, పూజా హెగ్డే, కార్తికేయ, అల్లు శిరీష్, నాగశౌర్య, ముస్కాన్, అవంతికా మిశ్రా, నందు-గీతామాధురి దంపతులు, ఉత్తేజ్ కుటుంబం, శ్రీను వైట్ల కుంటుంబం మొదలుగువారంతా దీపాలు వెలిగించి ఐక్యతను చాటారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.