Site icon TeluguMirchi.com

ఆ పాట కోస‌మైనా సినిమా చూడాలి

tarun-vimalaraman-hotత‌రుణ్ మ‌రోసారి బాక్సాఫీసు ద‌గ్గర విజ‌యం కోసం దండ‌యాత్ర చేయ‌బోతున్నాడు. ఎప్పుడో  పూర్తయిన `చుక్కలాంటి అమ్మాయి చ‌క్కనైన అబ్బాయి` సినిమాకి ఇన్నాళ్లకు మోక్షం ల‌భించింది. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అస‌లే ఫామ్ లేక తంటాలు ప‌డుతున్న త‌రుణ్‌ కి ఈ సినిమాపై కూడా ఆశ‌ల్లేవు. అందుకే ప్రమోష‌న్ చేయ‌డానికి కూడా ముందుకు రావ‌డం లేదు. క‌న్మణి ద‌ర్శక‌త్వం వ‌హించిన చిత్రమిది. విమ‌లారామ‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఆ అమ్మాయికీ విజ‌యాల్లేవు. ఈ ఇద్దరి జాత‌కాన్ని ఈ సినిమా ఎంత  ప్రభావితం చేస్తుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో త‌రుణ్‌, విమ‌లారామ‌న్ మ‌ధ్య కెమిస్ట్రీ గొప్పగా వ‌ర్కవుట్ అయ్యింద‌ట‌. ఓ పాట‌లో హాట్ హాట్‌ గా క‌నిపించార‌ట‌. క‌నీసం ఆ పాటైనా ఈ సినిమా పాటిల వ‌సూళ్ల దేవ‌త అవుతుందేమో చూడాలి.

Exit mobile version