Site icon TeluguMirchi.com

చరణ్‌ బాబూ! దీని భావమేమిటో ?

ramcharnరాం చరణ్‌… మెగా పవర్‌ స్టార్‌… మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు… ఐదు సినిమాల భారీ హీరో… టాలీవుడ్ లో పేద్ద హీరో అయిపోయాడు. ఇంతవరకూ బానే ఉంది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో ఎంటరవుతున్నాడు. అందునా బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ హీరొగా అప్పట్లో వచ్చి ఓ హిస్టరీ క్రియేట్‌ చేసిన జంజీర్‌ చిత్రం రీమేక్‌ తో. అంటే చెర్రీ ఇప్పుడు బాలీవుడ్‌ హీరో అనుకోవచ్చా? ఒక్క సినిమాతోనేనా.. అనుకోకండి ఇప్పుడు తాజాగా ఆయన చేసిన కామెంట్స్‌ వింటే అవునేమో అనిపించేలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. తన తండ్రీ చిరంజీవి సినిమాలు చేస్తున్న కాలంలోని టాలీవుడ్ ఇప్పుడు లేదనీ, మొత్తం పరిస్థితులన్నీ రివర్స్‌ అయిపోయాయని చెప్పాడు చరణ్‌. అంతేకాకుండా ఈ రివర్స్‌ ఎఫెక్ట్‌ వల్ల మనం కాస్త వెనకబడ్డామని కూడా అన్నాడట చెర్రీ. అప్పటి కాలంలో తెలుగు సినీపరిశ్రమలోని క్రమశిక్షణ, పద్దతులు చూసి బాలీవుడ్‌ సైతం నేర్చుకునేది, కానీ వారిని చూసి మనం నేర్చుకోవలసి వస్తోంది అంటున్నాడట ఈ యువహీరో. అయినా మనలో మన మాట.. ఓ కుటుంబం ఛిన్నాభిన్నమయిపోతుంది, వెనకబడిపోతుందీ అంటే అందుకు కారణం ఆ కుటుంబంలోని సభ్యులే.. అందునా ముఖ్యంగా ఆ కుటుంబ పెద్దలే.. వారు మారనంత కాలం పరిస్థితులు ఇలాగే ఏడుస్తాయన్న నిజం చరణ్‌ బాబు గమనించుకోవాలేమో.. అంటున్నారు సినీ పండితులు. ఒక్క మెతుకు చూసి అన్న ఉడికిందని చెప్పొచ్చేమో కానీ.. కేవలం ఒక్క సినిమాకు హిందీలో పనిచేసి మొత్తం బాలీవుడ్‌ బాగుంది అనుకోవడం ఎంతవరకూ సబబో చెర్రీ సారే ఆలోచించుకోవాలి….

Exit mobile version