అకిరా కు చిరు బెస్ట్ విషెష్

ఏప్రిల్ 08 మెగా అభిమానులకు పెద్ద పండగ రోజు. ఎందుకంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు అకిరా నందన్ పుట్టిన రోజు దీంతో మెగా అభిమానుల్లో డబుల్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా లో మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఇద్దరికీ బర్త్ డే విషెష్ అందిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మొదటి సంతానం అయిన అకిరా నందన్. పవన్ కల్యాణ్ తర్వాత వారసుడు ఎవరు అంటే అకిరా నందన్ అని చెబుతుంటారు ఫ్యాన్స్. ఇక అకిరా కూడా తనకు వీలు దొరికినప్పుడల్లా తండ్రి దగ్గరకు వస్తుంటాడు. అటు పెదనాన్న చిరంజీవి ఫ్యామిలీతో కూడా అకీరా కలిసే ఉంటాడు. ఈ సందర్భాంగా చిరంజీవి అకిరా ను ఎత్తుకొని ఉన్న చిన్నప్పటి ఫోటో ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి బెస్ట్ విషెష్ అందించారు.

“మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6’4”) అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి.Wish you a “Power”ful future. Happy Birthday Akira! #8thApril ” అంటూ తన విషెష్ ను అందజేశాడు.