Site icon TeluguMirchi.com

కోడలి మనసుకు ఫిదా అయినా చిరంజీవి ..

మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన పెద్ద మనసు కు ఫిదా అయ్యారు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ మూతపడింది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవిత రోడ్డున పడింది.

ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్ధిక సాయాన్ని అందజేస్తుండగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి మనకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటి ద్వారా సినీ కార్మికులను ఆదుకునే పని చేస్తున్నారు.

ఇప్పటికే ఈ ఛారిటీకి చాలామంది తమవంతు విరాళాలు ప్రకటించగా..తాజాగా చిరంజీవి కోడ‌లు ఉపాస‌న కూడా ఈ మంచి ప‌నిలో తాను భాగం అయ్యేందుకు ముందుకు వ‌చ్చింది. సి.సి.సి చేత చేత ధృవీకరించబడిన రోజువారీ కూలీ కార్మికులందరికీ ఉచిత మందులు అందించడానికి సిద్ద‌మైంది. ఈ సంద‌ర్భంగా చిరంజీవి త‌న కోడ‌లు ఉపాస‌నకి ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ‌న్య‌వాదాలు తెలిపారు. అలానే త‌న‌ది పెద్ద మ‌న‌సు అని అభినందించారు. పేద కార్మికులు మందుల‌ని అన్ని అపోలో ఫార్మ‌సీ సెంట‌ర్స్‌లో పొంద‌వ‌చ్చు అని చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version