కొరటాల అనుకున్నట్లే చిరు సిద్దమయ్యాడట..

సైరా చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి ..ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో నటించేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే పూజా కార్య క్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్లబోతుంది. తాజాగా కొరటాల శివ చిరు ను ఎలా చూపించాలని అనుకున్నాడో అలా చిరు సిద్ధమయినట్లు సమాచారం.

చిరంజీవి ని కొత్తగా, స్టైలిష్ లుక్ లో చూపించాలని డిసైడ్ అయినా కొరటాల.. ఆ లుక్ కోసం షూటింగ్ సైతం పక్కనబెట్టి ఎదురుచూశారు. ఇప్పటికే పలుసార్లు లుక్ టెస్ట్ చేసిన ఈయన ఎట్టకేలకు ఫైనల్ లుక్ టెస్ట్ ద్వారా కొరటాల చిరుకు తాను అనుకున్న లుక్ వచ్చిందని నిర్ణయించుకున్నారట. అంతేకాదు ఆ లుక్ పట్ల ఆయన చాలా సంతృప్తిగా ఉన్నారట. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.