సల్మాన్ – చిరులు కలిసి చిందులు..ఫ్యాన్స్ కు పండగే..


మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రాల్లో గాడ్ ఫాదర్. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ దసరా బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా తాలూకా హైలైట్స్ ను బయటకు తెలియజేస్తూ సినిమా ఫై ఆసక్తి పెంచేస్తున్నారు. ఇక ఈ సినిమా లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కాగా చిరంజీవి – సల్మాన్ ల మధ్య సన్నివేశాలే కాదు ఓ సాంగ్ లో ఇద్దరు చిందులేయబోతున్నట్లు స్వయంగా చిరంజీవి తెలిపారు.

ఈ పాట కచ్చితంగా కన్నులపండుగలా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ అప్డేట్​తో మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. చిరు, సల్మాన్​ డ్యాన్స్​తో థియేటర్ దద్దరిల్లిపోద్దని కామెంట్లు పెడుతున్నారు. ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.