మెగా స్టార్ మాట కాదని రంగ స్థలం

రామ్ చ‌ర‌ణ్ – సుకుమార్ సినిమా టైటిల్ ఎట్టకేలకు ఖారరైయింది. ఈ చిత్రానికి రంగ స్థలం అనే టైటిల్ ఖారారు చేశారు. అయితే ఈ టైటిల్ విషయంలో మెగాస్టార్ ని ఒప్పించడం చాలా కష్టమైయిందట.

చిరు ద‌గ్గ‌ర గ్రీన్ సిగ్న‌ల్ అందుకొనే విష‌యంలో త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చింద‌ట‌. ”రంగ స్థలం టైటిల్ మ‌రీ ఓల్డ్ గా ఉంది క‌దా”అని మెగాస్టార్ తన అభిప్రాయం వ్యక్తం చేశారట. అయితే సినిమా కాన్సెప్ట్‌ని దృష్టిలో ఉంచుకొన్న సుక్కు, రంగ స్థలం టైటిల్ ఎందుకు పెట్టాల్సివ‌చ్చిందో చిరుకి వివ‌రించాడ‌ట‌. ఈ విష‌యంలో రామ్ చ‌ర‌ణ్ కూడా సుక్కే కే స‌పోర్ట్ చేశాడ‌ట‌. దీంతో కొంచెం అయిష్టంగానీ ఓకే చెప్పరట చిరు. చిరు మాత్రం ‘ప‌ల్లెటూరి మొన‌గాడు’ అనే టైటిల్ కు ఓటు ఓటు వేశారట. అయితే చివరికి సుకుమార్ వాదనే నెగ్గింది.

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.