Site icon TeluguMirchi.com

ఉగాదికి చిరు మూవీ..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహ రెడ్డి చిత్రం తో దసరా బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 02 న ఈ మూవీ తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడం తో చిరు..నెక్స్ట్ మూవీ ఫై ఫోకస్ పెట్టారు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో చిరు సినిమా చేయబోతున్నాడు. సోషల్ మెసేజ్ తో కూడిన కథ గా తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాదికి (2020 మార్చి 25) రిలీజ్‌ చేయాలనే ప్లాన్‌లో చిరు & కొరటాల ఉన్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అమిత్‌ త్రివేది పేరుని పరిశీలిస్తున్నారట. త్వరలోనే మిగతా కాస్ట్ & క్రూ ఎంపిక పూర్తి చేసి మీడియా కు తెలియజేస్తారని సమాచారం.

Exit mobile version