చిరు-కొరటాల మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి – కొరటాలశివ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివ ఈ మూవీకి సంబందించిన ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. ఆగస్టు 22 న చిరంజీవి పుట్టిన రోజు కావడం తో ఆ రోజున ఈ సినిమా మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ..మరో రెండు నెలల తర్వాత సినిమాను మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారు.

ఇక ఈ చిత్ర మొదటి షెడ్యూల్ షూటింగ్ శ్రీకాకుళం జిల్లా పలాసలో మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. ప్రజారాజ్యం ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్లిన మెగాస్టార్ మళ్లీ ఇన్నేళ్లకు అక్కడికి షూటింగ్ కోసం వెళ్లనున్నాడు. మరి అక్కడి అభిమానుల మధ్య షూటింగ్ ఎలా జరుగుతుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో చిరు కు జోడిగా నయనతార ను అనుకుంటున్నట్లు వార్తలు వినిపించిన..శివ మాత్రం బాలీవుడ్ భామల వైపు మొగ్గు చూపిస్తున్నారట..సినిమా సెట్స్ పైకి వస్తే గాని చిరు జోడి ఎవరు అనేది తెలుస్తుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రామ్వా చరణ్ నిర్మించనున్నాడు.